Friday, October 22, 2010

Poetry-11

Poiya? Unmaiya?

e malupulo ninu daati nadichanu?
e maadhamarupulo ne thodu kadhannanu?
ela ninnu vadali santhi pondalanukunnanu?
emani ne prayathnala aasa thunchagaliganu?
kalamapude ivi maripinchindhi kani
avi bahukarinchina ekantham marichindhi
cheppavem.. ekada ninnu vidichanu?
e magathalo ninu kolpoyanu?
nanu maikamlo munchina ne matala velluva
kantiki kammina manchani thalachina vasthavikathalona
anukshanam venta undi andinchina anuragam
kalayapanani mudravesina moorkhatvamlona
na chinnagayanike alladina nee apeksha
palukulo mathrame imidindhanna alochanalona
prathi maithrini, paripoornamga madicherchukunna ne manchithanam
na sthanam asaswatham chesenanna asooyalona
snehanni meerina cheruva, pranayamantu parichina ne manasu
nake poorthiga prathyekam kadanukunna anumanamlona
na porapatlanu manninchi, sunnithathvanni grahinchina paripakvatha
ne swardhamanukuni vismarinchina agnanamlona
ne vidhinchina siksha marichi, marala daricherina ne prema
na swardhamtho vadilinchukuni vesina tholi adugulona
ivanni na smruthikipudu dooram
avi migilchina lotu mathram padilam

ఏ మలుపులో నిను దాటి నడిచాను ?
ఏ ఆదమరుపులో నీ తోడు కాదన్నాను ?
ఎలా నిన్ను వదలి శాంతి పొందాలనుకున్నాను ?
ఏమని నీ ప్రయత్నాల ఆశ తుమ్చాగాలిగాను ?
కాలమపుడే ఇవి మరిపించింది కానీ
అవి బహుకరించిన ఏకాంతం మరిచింది
చెప్పవేం .. ఎక్కడ నిన్ను విడిచాను ?
ఏ మగతలో నిను కోల్పోయాను ?
నను మైకంలో ముంచిన నీ మాటల వెల్లువ
కంటికి కమ్మిన మంచని తలచిన వాస్తవికతలోనా?
అనుక్షణం వెంట ఉండి అందించిన అనురాగం
కాలాయాపనని ముద్రవేసిన మూర్ఖత్వంలోనా ?
నా చిన్నగాయనికే అల్లాడిన నీ అపేక్ష
పలుకులో మాత్రమే ఇమిడిందన్న ఆలోచనలోనా ?
ప్రతి మైత్రిని , పరిపూర్ణంగా మదిచేర్చుకున్న నీ మంచితనం
నా స్థానం అశాశ్వతం చేసేనన్న అసూయలోనా ?
స్నేహాన్ని మీరిన చేరువ , ప్రణయమంటూ పరిచిన nee మనసు
నాకే పూర్తిగా ప్రత్యేకం కాదనుకున్న అనుమానంలోనా ?
నా పొరపాట్లను మన్నించి , సున్నితత్వాన్ని గ్రహించిన పరిపక్వత
నీ స్వార్ధమనుకుని విస్మరించిన అజ్ఞానంలోనా ?
నే విధించిన శిక్ష మరిచి , మరల దరిచేరిన నే ప్రేమ
నా స్వార్ధంతో వదిలించుకుని వేసిన తొలి అడుగులోనా ?
ఇవన్నీ నా స్మృతికిపుడు దూరం
అవి మిగిల్చిన లోటు మాత్రం పదిలం


-Dedicated to my inspiration