Sunday, April 18, 2010

Poetry-9

Poiya? Unmaiya?

kanulara ninu veekshinche adrushtam naku ledha?
nesthama ninu manasara thilakinche tarunam radha?
ennallu vechanu ee avakasam kosam?
ee nadu eduraithe endukee assahayam?
kalalo roju kavvinche ee kshanam
sakalam kalisochina theliyani duram
pai mounaniki karanamenti?
lona anthuleni alajadi deniki?
nanu dinam chuttese ne thalapu
netho panchukovalane thapana?
allanthalo unna ninnu andukoleka
vadalipoyi nanu nindinche aasa?
ee sandhyalo ne usulu gurthukosthunte
avi gatham anna nijam thattaledhu
ne thodu leka gadipina yugalu
ne snehamloni madhuranubhuthulni maripinchatledhu
edho agipoyina stabdhata
anthalo alala ponge udhrutam
anduke ee vedana alakinchu
na porapatunu manninchu
oh sari darsanamippinchu


కనులారా నిను వీక్షించే అదృష్టం naaku లేదా?
నేస్తమా నిను మనసారా తిలకించే తరుణం రాదా?
ఎన్నాళ్ళు వేచాను అవకాశం కోసం
ఈనాడు ఎదురైతే ఎందుకీ అస్సహాయం ?
కలలో రోజూ కవ్వించే క్షణం
సకలం కలిసొచ్చినా తెలియని దూరం
పై మౌనానికి కారణమేంటి?
లోన అంతులేని అలజడి దేనికి?
నను దినం చుట్టేసే తలపు
నీతో పంచుకోవాలనే తపనా?
అల్లంతలో ఉన్న నిన్ను అందుకోలేక
వడలిపోయి నన్ను నిందించే ఆశా?
సంధ్యలో నీ ఊసులు గుర్తుకొస్తుంటే
అవి గతం అన్న నిజం తట్టలేదు
నీ తోడు లేక గడిపిన యుగాలు
నీ స్నేహం లోని మధురానుభూతుల్ని మరిపించట్లేదు
ఏదో ఆగిపోయిన స్తబ్దత
అంతలో అలల పొంగే ఉధృతం
అందుకే వేదన ఆలకించు
నా పొరపాటును మన్నించు
సారి దరసనమిప్పించు


-dedicated to my inspiration

No comments:

Post a Comment