Poiya? Unmaiya?
gathamanthaa chedukalalaa jarigipoyindi
gnapakalanni moola gadhilo moothapadipoyayi
kshnamaina venakki thirigi choodalenu
andhani draaksha panduni theepanukolenu
ninna andhaalanni chethulaara cheripi
marali raakunda jagrathapaddaanu
repatikosam jarigina praakulaatalo
poraadi poraadi odi gelichaanu
samayam nannu aadinchi
nirnayam ghadiyalo theesukomandhi
hrudayam vilapinchi vilapinchi alasipoyi
lokaanike dhaanni vadilesindhi
evarinee nindinchalenu
evarikee vivarinchalenu
tholisaari nannu thaakina oka adbhutham
kanu thericheloga ayinadhi adrusyam
kanneetiki kooda naa meeda jaali kalagaledhu,
aa anuraagam nannu niluvaneeyakunda chesthunte!
kadilipothondhi kaalam,
appati santhoshaalu naa madhi, smrithilo nindipothunte!
గతమంతా చేదుకలలా జరిగిపోయింది
జ్ఞాపకాలన్నీ మూల గదిలో మూతపడిపోయాయి
క్షణమైనా వెనక్కి తిరిగి చూడలేను
అందని ద్రాక్ష పండుని తీపనుకోలేను
నిన్న అందాలన్నీ చేతులారా చెరిపి
మరలి రాకుండా జాగ్రత్తపడ్డాను
రేపటికోసం జరిగిన ప్రాకులాటలో
పోరాడి పోరాడి ఓడి గెలిచాను
సమయం నన్ను ఆడించి
నిర్ణయం ఘడియలో తీసుకోమంది
హృదయం విలపించి విలపించి అలసిపోయి
లోకానికే దాన్ని వదిలేసింది
ఎవరినీ నిందించలేను
ఎవరికీ వివరించలేను
తొలిసారి నన్ను తాకిన ఒక అద్భుతం
కను తెరిచేలోగా అయినది అదృశ్యం
కన్నీటికి కూడా నా మీద జాలి కలగలేదు ,
ఆ అనురాగం నన్ను నిలువనీయకుండా చేస్తుంటే !
కదిలిపోతోంది కాలం ,
అప్పటి సంతోషాలు నా మది , స్మృతి నిండిపోతుంటే !
-dedicated to my inspiration
No comments:
Post a Comment